ప్రమాణస్వీకారం చేసిన తెల్లారే క్షీణించిన ఆరోగ్యం.. చికిత్స పొందుతూ బోటితండా సర్పంచ్ కన్నుమూత
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
కారేపల్లి,జనవరి 21: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తులసీరామ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే తులసీరామ్ పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అక్కడి వైద్యుల సలహాతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తులసీరామ్ కన్నుమూశారు. తులసీరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సర్పంచ్ తులసీరామ్ మృతితో బోటితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తులసీరామ్ మృతి పట్ల మండలంలోని ఇతర సర్పంచ్‌లు, వివిధ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

