తల్లాడ, మే 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా గ్రామీణ క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు సన్నద్ధమైంది. ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం ఉండాలనే లక్ష్యంతో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుంది. మండల పరిధిలోని కుర్నవల్లిలో ఎకరం స్థలంలో క్రీడాప్రాంగణ ఏర్పాటుకు అధికారులు క్రీడాస్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ, యువకులు, విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు సీఎం కేసీఆర్ గ్రామీణ క్రీడాప్రాంగణాలకు శ్రీకారం చుట్టారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులతో పాటు, ప్రాంగణం చుట్టూ వాకింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ వెళ్లేందుకు అవకాశం ఉంది. క్రీడాప్రాంగణం పక్కనే మరో ఎకరంలో పల్లెప్రకృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటిక క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే గ్రామంలో ఆహ్లాదకరమైన పల్లె పార్క్, డంపింగ్యార్డు, శ్మశానవాటిక, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించామన్నారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో గ్రామంలోని యువత క్రీడల్లో రాణించేలా కృషి చేస్తామన్నారు. క్రీడామైదానానికి అవసరమైన స్థలం దొరకడం అదృష్టమన్నారు. గ్రామంలో ప్రతిఒక్కరూ క్రీడాప్రాంగణాన్ని ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
కొణిజర్ల, మే29 : తనికెళ్ల గ్రామంలో క్రీడాప్రాంగణాన్ని సర్పంచ్ చల్లా మోహన్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం క్రీడాప్రాంగణంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోట్ల ఏర్పాట్లకు ముగ్గులు వేసి సిద్ధం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ, రాంబాబు, పీఈటీలు శంకర్రావు, మల్లికార్జున్ పాల్గొన్నారు.