ఖమ్మం: ఆడపిల్లల్లో ఆత్మ స్థైర్యాన్నిపెంపొందించుకోవడానికి కరాటే ఎంతగానో దోహద పడుతుందని నగరమేయర్ పునకొల్లు నీరజ పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కరాటేలో ప్రతిభ చాటిన విద్యార్ధులకు ప్రసంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ షేక్ ఖాసీం, శ్రీనివాస్, వీ చంద్రశేఖర్, షేక్ ఆరీఫ్, రిటైర్డ్ ఏఎస్సై షేక్ అఫ్జల్మియా, సలీం తదితరులు పాల్గొన్నారు.