కారేపల్లి, ఆగస్టు 14 : సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం పొడిగింపు పట్ల కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. సోసైటీలు, డీసీసీబీల పునర్వ్యవస్తీకరణ జరుగుతున్న క్రమంలో ఎన్నికలు జరుపడం సాధ్యం కాదని, ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించి జీఓ నెం. 386 ను విడుదల చేసినట్లు కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు తెలిపారు. పాలకవర్గం పదవీకాలంపై సందిగ్ధత తొలగడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ జెండా ఎగురవేయడానికి చైర్మన్లకు అడ్డంకులు తొలిగాయి. పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.
Karepalli : పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు పట్ల హర్షం