ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు ఒక రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్.శ్రీనివాసరావును సంప్రదించాడు.
- రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
అశ్వారావుపేట, జూన్ 29: చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు ఒక రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్.శ్రీనివాసరావును సంప్రదించాడు. దీంతో మట్టి తరలించేందుకు రైతు వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని బతిమిలాడగా రూ.2 లక్షలకు ఏఈఈ రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అనంతరం సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, అధికారి లంచం అడిగిన విషయాన్ని వివరించాడు. దీంతో వారు పన్నిన పథకం ప్రకారం అశ్వారావుపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో రూ.2 లక్షల నగదును రైతు ఏఈఈ శ్రీనివాసరావుకు అందిస్తుండగా అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారుల బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. శ్రీనివాసరావును కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమేశ్ వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేస్తే బాధితులు తమను సంప్రదించాలని, వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

