మధిర, అక్టోబర్ 27: మధిర నియోజకవర్గంలో ఏటా 200 మందికి వివిధ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఐటీఐ ఏర్పాటు కోసం అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.11.37 కోట్లను భవన నిర్మాణం, తరగతి గదులు, యంత్ర సామగ్రి, వర్క్‌షాపు పుస్తకాలు, శిక్షణ నిధి సహా ఇతర ఖర్చుల కోసం వెచ్చించనున్నారు.
కొత్త ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐవోటీ స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐలో శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రిన్సిపాల్ సహా వివిధ స్థాయిల శిక్షణ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా 21 పోస్టులు, పొరుగు సేవల కింద మరో ఐదు పోస్టులు మంజూరయ్యాయి. అయితే, ఈ ఐటీఐని మధిర నియోజకవర్గ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశంపై ఆ జీవోలో వెల్లడించలేదు