కారేపల్లి, నవంబర్ 11 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీలో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, ఓవర్ లోడ్‌తో తరలి వెళ్తున్న ఆటోలను ఆపి తనిఖీలు చేశారు. గ్రావెల్, మట్టి, ఇసుక తోలకాలకు సంబంధించి అనుమతి పత్రాలు చూపించి తీసుకెళ్లాలని వాహనదారులకు ఎస్ఐ బైర్ గోపి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, అట్లా వాహనాలు నడిపే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. పలు వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించారు. చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులతో ఆన్లైన్ ద్వారా బకాయిలు చెల్లించేలా చూశారు. ఈ వాహనాల తనిఖీలో పోలీస్ సిబ్బంది శంకర్, ఓంకార్ పాల్గొన్నారు.

Karepally : కారేపల్లిలో ముమ్మరంగా వాహన తనిఖీలు