మధిర, మే 05 : మధిర పట్టణంలో 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్ సాయి తెలిపారు. సోమవారం మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. పట్టణంలో ప్రధాన కూడలితో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్డు మార్గాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగతనాలు, ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్ కేసుల్లో కీలకంగా సీసీ కెమెరాలు సాయపడనున్నట్లు చెప్పారు.
సీపీ సునీల్ దత్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ నిధులు రూ.4.30 లక్షలతో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్త టెక్నాలజీ కలిగిన ANPR కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మధిర సీఐ డి.మధు. ఎస్ఐ చంద్రశేఖరరావు, ఏఎస్ఐ లచ్చు, ట్రైనీ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.