కారేపల్లి, సెప్టెంబర్ 10 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్యాతండాలో గల రెండో వార్డులో లోహిత శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దొంగతనాలు, గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బానోత్ బాలు నాయక్ రూ.20 వేలు ఖర్చు చేసి తండా రెండో వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై తండాలో ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య రామ్ సింగ్, బానోత్ సెట్రామ్, భుక్య బావుసింగ్, గుగులోత్ బాలాజీ, భూక్య బిచ్చు, బానోత్ ప్రేమ్ కుమార్, ఆంగోత్ శివ, బానోత్ ఇంద్రజిత్ నాయక్ పాల్గొన్నారు.