కాళేశ్వరం జనవరి 10 : కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి హుండీ ద్వారా రూ.23.58,715ల ఆదాయం వచ్చినట్లు ఈవో మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ఆవరణలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్‌రావు, ఈవో మహేశ్, ఇన్స్పెక్టర్ అనిల్ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. 69 రోజులకు గాను రూ. 23.58లక్షల ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు బుర్రి శ్రీనివాస్, ధర్మకర్తలు రాంరెడ్డి, శ్యాంసుందర్, బండి రాజయ్య పాల్గొన్నారు.