దివ్యాంగుల పింఛన్లు తక్షణమే పెంచాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
- వెంటనే పెంపు ప్రకటన చేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం
- వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు
ఖమ్మం వ్యవసాయం, జూన్ 19: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం నేతల రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాకు వచ్చిన ఆ సంఘం బాధ్యులు.. వీహెచ్పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీచౌదరి, రాష్ట అధ్యక్షుడు కాళ్ల జంగయ్య ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందె రాంబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ 6 వేలకు; వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ గురించి ముఖ్యమంత్రి రేంవంత్‌రెడ్డి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అలాగే, మహిళల మాదిరిగానే దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. సంఘం నాయకులు చిట్టిరాజు, ఉపేందర్, భూలక్ష్మి, చెరుకునపల్లి శ్రీనివాస్, రాము, వీరబాబు, మల్లికార్జున్, ఉపేంద్రయ్య, గోపాల్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

