ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకలు, మొక్కుబడులు లెక్కించగా రూ.40,70,859 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కే.జగన్మోహన్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్శర్మ, దేవాదయశాఖ ఖమ్మం పరిశీలకులు ఆర్. సమత, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్, సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.