చెమ్మకేళీల హోలీ..
‘హోలీ హోలీర రంగ హోలీ.. చెమ్మకేళీల హోలీ..’ అంటూ చిన్నా పెద్దా సందడి చేశారు. మానవ జీవితమే సప్తవర్ణాల శోభితమంటూ పరస్ఫరం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగ హోలీని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు పరస్ఫరం రంగులు పూసుకుంటూ వేడుకలు చేసుకున్నారు.
‘హోలీ హోలీర రంగ హోలీ.. చెమ్మకేళీల హోలీ..’ అంటూ చిన్నా పెద్దా సందడి చేశారు. మానవ జీవితమే సప్తవర్ణాల శోభితమంటూ పరస్ఫరం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగ హోలీని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు పరస్ఫరం రంగులు పూసుకుంటూ వేడుకలు చేసుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. సహచర మహిళా అధికారులకు, చిన్నారులకు రంగులు పూశారు. మహిళా అధికారులు కూడా కలెక్టర్‌తో మమేకమై ఆమెకు కూడా రంగులు పూశారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన డప్పుల మ్యూజిక్‌కి ఎస్పీ రోహిత్‌రాజు. అదనపు ఎస్పీ సాయిమనోహర్, ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, డీఎస్పీలు స్టెప్పులు వేసి అందరినీ అబ్బురపరిచారు.ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ దంపతులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేల్పుల విజేత తదితర అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంగన్వాడీ చిన్నారులతో సరదగా ఆడుకున్నారు. డీసీహెచ్ఎస్ రవిబాబు డప్పు కొడుతూ సంబురాల్లో పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

