క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.
- దేశంలో అన్ని మతాలనూ గౌరవించేది తెలంగాణ ప్రభుత్వమే
- క్రిస్మస్ కానుకల పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కల్లూరు, డిసెంబర్ 20: రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 185 మంది పేద క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు ప్రేమవిందు, దుస్తులు, కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అనంతరం వివిధ చర్చీల ఫాదర్లు, పాస్టర్లు, క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
తల్లాడలో..
తల్లాడ, డిసెంబర్ 20: తల్లాడ రైతువేదికలో జరిగిన కార్యక్రమంలోనూ పేద క్రైస్తవులకు ఎమ్మెల్యే సండ్ర క్రిస్మిస్ కానుకలను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ప్రమీల, దుపాటి భద్రరాజు, దుగ్గిదేవర వెంకట్‌లాల్, గంటా శ్రీలత, శ్రీనివాస్, జొన్నలగడ్డం కిరణ్‌బాబు, బద్ధం కోటిరెడ్డి, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, జీవీఆర్, మువ్వా మురళి, రుద్రాక్ష బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
కల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. అనంతరం 49 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10,311 మందికి రూ.93 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు.
రూ.80 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం..
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఆ నిధులతో సంక్రాంతి నాటికి సీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో కల్లూరు మండలంలో 10 పంచాయతీలకు నూతన భవనాలు మంజూరయ్యాయని, వాటిని త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, చర్చీల బాధ్యులు సూర్యనారాయణ, రవికుమార్, బాబ్జీ ప్రసాద్, పాలెపు రామారావు, కట్టా అజయ్‌బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

