ఖమ్మం రూరల్, జూన్ 3 : రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన కోసూరి అప్పారావు తన కూతురు బృంద(4)తో కలిసి మిత్రుడి ఆటోలో ఎదులాపురం నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను రోడ్డు పక్కగా ఆపి డబ్బా కొట్టుకాడికి వెళ్లారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆటోలోనే ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మరణ వార్త తెలుసుకున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చరికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని సందర్శించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చారు.