వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
జస్టిస్ ఫర్ సోషల్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (జేఎస్పీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ వలసదారులకు అన్నదానం నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజర్ దాట్ల రవితేజ, దివ్య దంపతుల కుమార్తె హద్విత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
– చిన్నారి హద్విత పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి
– 200 మందికి అన్నదానం
ఖమ్మం రూరల్, అక్టోబర్ 17 : జస్టిస్ ఫర్ సోషల్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (జేఎస్పీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ వలసదారులకు అన్నదానం నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజర్ దాట్ల రవితేజ, దివ్య దంపతుల కుమార్తె హద్విత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెదపాక రమేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నామా వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు వేముల సీతారామారావు, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అస్గర్, కోశాధికారి మామిళ్లపల్లి నాగయ్యతో పాటు ఈసీ మెంబర్స్ చెన్నబోయి లక్ష్మీనారాయణ, మురికిపూడి బాబురావు, పులిపాటి నరసింహారావు, బత్తుల గోపాలరావు, గడదాస్ అప్పారావు, ఎర్ర నాగరాజు రెడ్డి, పలువురు సభ్యులు హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు, వలసదారులు హర్షం వ్యక్తం చేశారు.

వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

