మధిర, ఏప్రిల్ 04 : రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం మార్క్ఫెడ్ డీఎం సునీత అన్నారు. శుక్రవారం చింతకాని సహకార సంఘంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్ముకోవాలన్నారు.
క్వింటాకు రూ.2,225 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మొక్కజొన్నల తేమ శాతం 14 మించి ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని సహకార సంఘం అధ్యక్షుడు కొండపల్లి శేఖర్ రెడ్డి, తాసీల్దార్ కూరపాటి అనంతరాజు, మండల వ్యవసాయ అధికారి మానస, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కొప్పుల గోవిందరావు, తూము కోటేశ్వరరావు, సహకార సంఘం ఉపాధ్యక్షుడు మాదినేని రవి, డైరెక్టర్లు కిలారు మనోహర్ బాబు, నన్నక కోటయ్య, సహకార సంఘం సీఈఓ ఎం. శ్రీనివాసరావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.