రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ పంట రుణమాఫీ ప్రకటన పల్లెలకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఊరూరా రైతుల సంబురాలు అంబరాన్నంటేలా చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌ను ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు వేనోళ్ల కొనియాడుతున్నారు. తమ పాలిట దేవుడంటూ కృతజ్ఞతాభావంతో గురువారం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ‘జయహో కేసీఆర్.. జైజై కేసీఆర్..’ అంటూ నినదించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, పల్లెలు, రైతు వేదికలు, పొలం గట్లు ఎక్కడ చూసినా సందడి కనిపించింది. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోరే దర్శనమిచ్చింది. ఖమ్మం రూరల్ మండలం సీతారాంపురానికి చెందిన రైతులు వరి నారుతో ‘కేసీఆర్’ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పొలం గట్లపై బీఆర్ఎస్ జెండాలు చేబూని జాతరకు వస్తున్నట్లుగా సంబురాలకు వచ్చారు.
ఖమ్మం ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామనే సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రామగ్రామాన సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం రూరల్ మండలం సీతారాంపురం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమ్మ అధ్యక్షతన రైతులు సంబురాలు చేశారు. పంట పొలాల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. దమ్మపేట సంబురాల్లో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ జోగేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు సత్తుపల్లి, పినపాక, చండ్రుగొండ, టేకులపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు సంబురాలు నిర్వహించారు. తల్లాడ సంబురాల్లో ఏఎంసీ వైస్ చైర్మన్ భద్రరాజు, మధిరలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నేలకొండపల్లిలో బీఆర్ఎస్ మండల అధక్షుడు బ్రహ్మయ్య, వైరాలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి.
Khammam4
రుణమాఫీ సంతోషకరం
సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయడం సంతోషకరం. నెల రోజుల్లో రుణమాఫీ అంతా రైతుల ఖాతాల్లో జమ కావడం వల్ల వారికి భరోసా కల్పించినైట్లెంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసిన ఆరోపణలకు చెంప పెట్టులా సీఎం కేసీఆర్ వ్యవహరించారు. రుణమాఫీ వల్ల మండలంలోని రైతాంగానికి మరోసారి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. రైతులు సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోరనడానికి ఇదే నిదర్శనం.
-వేమూరి ప్రసాద్, రైతుబంధు మండల కన్వీనర్, బోనకల్
బ్యాంక్ అప్పు తీరుతుంది
సీఎం కేసీఆర్ రుణమాఫీపై ఇచ్చిన ఆదేశాలతో నేను బ్యాంకులో తీసుకున్న తీరుతుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీంతో బ్యాంకులో ఉన్న మా అప్పు తీరి తిరిగి కొత్త రుణం తీసుకునేందుకు సీఎం కేసీఆర్ మాకు అవకాశం కల్పించారు. రుణమాఫీకి నిధులు మంజూరు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-షేక్ ఫరీద్బీ, మహిళా రైతు, మధిర
రైతు బాంధవుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. ఆయన పాలనలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయం. రుణమాఫీ వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. నాకున్న ఎకరంన్నర పొలానికి నేను రూ.లక్ష వరకు రుణం తీసుకున్నా. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న మాకు తీపి కబురు చెప్పిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-ఎం.వెంకటనర్సయ్య, రైతు, మాటూరుపేట, మధిర మండలం
హామీ నిలబెట్టుకున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ పథకాన్ని ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు. దీనివల్ల రైతులకు ఎంతో ఊరట కలిగింది. రుణమాఫీ వల్ల రాష్ట్రంలో కోట్లాది మంది రైతులకు ఈ పథకం వర్తించడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తున్నది. రైతుబంధు అమలు చేస్తూనే రైతులకు రుణమాఫీ చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి.
-మేకా చెన్నారెడ్డి, కొత్తూరు, సత్తుపల్లి మండలం
రైతుల గురించే ఆలోచన
సీఎం కేసీఆర్ నిత్యం రైతుల గురించే ఆలోచన చేస్తారు. రైతులను వ్యవసాయ పరంగా ఆదుకునేందుకు రుణమాఫీ అమలు చేయడం వల్ల అప్పుల బాధ తీరింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహా వ్యక్తి సీఎం కేసీఆర్. రుణమాఫీ చేసినందుకు రైతులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. దీనిని ఎప్పటికీ మరిచిపోలేం.
-సూరపనేని నాగయ్య, రైతు, ముసలిమడుగు, వైరా మండలం
రైతు కుటుంబాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ రైతుబంధు, రైతుబీమా, పోడు రైతులకు పట్టాలు ఇలా ప్రతి కార్యక్రమం రైతుల కోసమే ప్రవేశపెట్టి రైతుబాంధవునిగా నిలిచారు. తాజాగా రూ.లక్షలోపు రైతులకు రుణమాఫీ వర్తింపజేసి రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
-కోరాడ నర్సింహారావు, రైతు, దుమ్ముగూడెం
రైతుల కష్టం తెలుసు
రైతుల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే రైతుబీమా, రైతుబంధు, 24 గంటల కరెంటు, ఇప్పుడు రుణమాఫీ చేసి మా పాలిట దేవుడయ్యారు. రైతులందరం సార్‌ను మళ్లీ సీఎం చేస్తాం. మా నాన్నలు పడ్డ కష్టం మేము చూశాం. ఇప్పుడు పంటల పెట్టుబడికి ఇబ్బంది లేదు. రుణమాఫీతో బ్యాంకు అప్పులు తీర్చుకుంటాం. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటాం.
-గుగులోత్ మంగ్యా, రూప్లాతండా, సుజాతనగర్ మండలం
గెలిపిస్తున్న దేవుడు కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో అరిగోస పడి ఓడిపోయిన తమను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో గెలిపిస్తున్నారు. మేము అనుకున్నట్లుగానే కేసీఆర్ ఆలోచన చేసిండనిపిస్తుంది. వచ్చీ రాంగనే అప్పులు తీర్చిండు. 24 గంటల కరెంట్ తీసుకొచ్చిండు. దీంతో మాకు ధైర్యం వచ్చింది. రైతులను ఆదుకున్న నాయకుడు ఎప్పుడూ చెడిపోడు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి తీరుతాం.
-మట్టా వీరభద్రం, రైతు, సీతారాంపురం, ఖమ్మం రూరల్ మండలం
కేసీఆర్‌ను ఎలా మర్చిపోతాం
రైతులకు అవసరమైన సౌకర్యాలు, సాగుకు కావాల్సిన సౌలతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎలా మర్చిపోతాం. రైతు అంటే పట్టించుకునే నాథుడే దేశంలో కరువయ్యాడు. ఇయ్యా ల మన సీఎంను చూసిన తరువాత అందురూ మాకు కావాలి కేసీఆర్ అంటున్నారు. రుణమాఫీ ప్రకటన తర్వాత సంతోసంగా ఉంది. కేసీఆర్ మూడోసారి కాదు.. ప్రాణం ఉన్నంతవరకు సీఎంగానే ఉంటారు. -వీ.విజయలక్ష్మి, సర్పంచ్, మహిళా రైతు, కొండాపురం, ఖమ్మం రూరల్ మండలం
చాలా సంతోషంగా ఉంది
రూ.లక్ష రుణం మాఫీ చేయడం సంతోషంగా ఉంది. అప్పుడు కూడా మాటి ఇచ్చినట్లుగానే మాఫీ చేశారు. పంటల పెట్టుబడి కూడా ఇస్తున్నారు. కాంగ్రెసోళ్లు ఎట్లాంటి వాళ్లో నాకు తెలసు. నా ఓటుతోపాటు నా ప్రాణం ఉన్నంత వరకూ కేసీఆర్‌తోనే ఉంటా. అందరూ మంచిగా బతకాలని కేసీఆర్ ఎప్పుడూ టీవీలో చెబుతుంటే సంతోషమయ్యేది. కేసీఆర్ పది కాలాలపాటు సల్లంగా ఉండాలి.
-తమ్మిశెట్టి గోపయ్య, రైతు, గుదిమళ్ల, ఖమ్మం రూరల్ మండలం
రుణమాఫీ హర్షణీయం
సీఎం కేసీఆర్ రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాయం ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా అయింది. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న రుణమాఫీ నిర్ణయంతో ఎన్నో నిరుపేద రైతు కుటుంబాలకు వరంగా మారనుంది. కేసీఆర్‌ను రైతులు ఎన్నటికీ మరువరు.
-పేరం శ్రీనివాసరెడ్డి, రైతు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం
తు పథకాలే సాక్ష్యం
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ రైతును రాజును చేసి రైతు బాంధవుడిగా నిలిచారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలుచేసే ప్రతి పథకం రైతులకు వరంగా మారింది. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చారు. రైతు జీవించి ఉన్నంతకాలం కేసీఆర్‌ను మరువరనడానికి పథకాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
-దారం భాస్కరరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం
రైతు గుండెల్లో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. రైతుబంధు, రైతుబీమా, గిరిజన రైతులకు పోడు పట్టాలు, రుణమాఫీతో రైతుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటిలేదు.
-బిక్కసాని శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్
రైతుల దేవుడు కేసీఆర్
రైతన్నలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను చేపట్టి సీఎం కేసీఆర్ అన్నదాతలకు దేవుడయ్యారు. రైతులు కేసీఆర్ పాలనలో రాజుగా బతుకుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన రుణమాఫీతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల తరఫున కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
-పొడియం ముత్యాలమ్మ, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్