జూలూరుపాడు, మార్చి 10 : క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం లేక చాలామంది పనుల్లో బిజీ అవుతున్నారని, శారీరక శ్రమ కోసం తప్పనిసరిగా ఆటలు ఆడాలని చెప్పారు. క్రీడా నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ బాధావత్ రవి, నాయకులు మాలోత్ మంగీలాల్ నాయక్. రాథోడ్ నిర్వాహకులు షఫీ, అన్వేష్, శ్రీను పాల్గొన్నారు.