మామిళ్లగూడెం, మే 27 : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్.. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, డాక్టర్ సుఖ్భీర్సింగ్ సందులతో కలిసి కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా..
ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించాలని, ఫలితాలు వెలువరించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్‌రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని, వీవీ ప్యాట్ లెకింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో ఎం.రాజేశ్వరి, జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.