మామిళ్లగూడెం, ఏప్రిల్ 27 : ఖమ్మం జిల్లా కలెక్టర్గా టీఎస్ దివాకర సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దివాకర ఖమ్మం కలెక్టర్గా బదిలీ అయిన విషయం విదితమే.
కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దివాకరను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.