కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 26: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ సామగ్రిని ఆయా ఏరియాల్లో మంగళవారం కార్మిక శాఖ పంపిణీ చేసింది. బుధవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ ఎన్నికలకు సంస్థవ్యాప్తంగా 84 పోలింగ్ బూత్లు ఏర్పాటయ్యాయి.