భద్రాచలం, జూలై 3 : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులుదీరారు.
భక్తుల రామనామస్మరణతో రామాలయ పరిసర ప్రాంతాలు, మాడవీధులు మార్మోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.