పినపాక, డిసెంబర్ 8: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులనైనా వెచ్చిస్తారని అన్నారు. మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో రూ.5 లక్షలు, పినపాకలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం గడ్డంపల్లి గ్రామంలో రూ.14 లక్షలతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్డులో గ్రామపంచాయతీ ద్వారాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన 3 సీసీ రోడ్లను, ఆధునీకరించిన బస్టాండ్‌ను, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పాతరెడ్డిపాలెంలో రూ.10 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.
పినపాక నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కోట్ల నిధులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ.బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి నిర్మాణంలో ఉన్న పీఎస్ భవనం పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి గాంధీ, దాట్ల సుభద్రాదేవి, పగడాల సతీశ్‌రెడ్డి, వర్మ, భద్రయ్య, భవానీశంకర్, వాసుబాబు, బుల్లిబాబు, గణేశ్, సురేశ్, తిరుపతి, సత్యం, గొగ్గెల నాగేశ్వరరావు, కోరెం రజిని, రాము, డీఎస్పీ రాఘవేందర్రావు, సీఐ రాజగోపాల్ పాల్గొన్నారు.
మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్డులో టీఆర్ఎస్ నాయకుడు ముక్కు వెంకటనర్సారెడ్డి ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన సుమారు 500 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్ రేగా గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.