Khammam Rural : ఊరిని గెలిపించేలా నిర్ణయాలుండాలి : ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్ది
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి ప్రతి రాజకీయ నాయకుడు, కార్యకర్త ఊరు గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు.
ఖమ్మం రూరల్, నవంబర్ 29 : ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి ప్రతి రాజకీయ నాయకుడు, కార్యకర్త ఊరు గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ముష్కరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీబీ మాట్లాడారు. వచ్చే పక్షం రోజులు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి మొదలుకుని అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత సైతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిత్యం కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రతి సెక్టార్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్
గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కుల, మతాలుగా విభజించి ప్రచారం నిర్వహించరాదన్నారు. పోలింగ్ కేంద్రం చుట్టూ ఉన్న 200 మీటర్ల లోపు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ స్టేషన్కు తీసుకోవచ్చు ఓటు హక్కు వినియోగించే విధంగా ఎన్నికల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉండవద్దన్నారు. సోదరభావంతో సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచార ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పోలింగ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఊరేగింపులు పూర్తిగా నిషేధమని, ఎన్నికల ప్రచార సమయంలో ర్యాలీలు నిర్వహించినట్లయితే ఒకరోజు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మండలంలో 8 సెక్టార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సెక్టార్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు గ్రామస్తులు తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అందరికీ మంచిదన్నారు.
ఎన్నికల ప్రశాంతత అందరి బాధ్యత
ఎన్నికల సమయంలో ఎలాంటి సందేహాలు, ఇతర విషయాలు మీ పరిధిలోకి వచ్చినట్లయితే రూరల్ సీఐ, ఏసీపీ, జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, మండలంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే రాబోయే రోజుల్లో సదరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని, ఈ పక్షం రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణ 24 గంటల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పుష్కరాజ్, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఆయా గ్రామాలకు చెందిన రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Khammam Rural : ఊరిను గెలిపించే విధంగా నిర్ణయాలుండాలి : ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్ది
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

