నిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నిరుద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 05 : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నిరుద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఐక్యంగా ఎదురించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు, ప్రకటనలు చేసి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువత ఆశలను ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు. గురుకులాల్లో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లను మినహాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి
వైరా టౌన్ : బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కట్టా కృష్ణార్జున రావు, వెంకటేశ్వరరావు, వనమా విశ్వేశ్వరరావు, మద్దెల రవి, ఏదునూరి శ్రీను, నూకల వాసు, వదినేపల్లి చక్రవర్తి, షేక్ సైదా, సింగవరపు నరేష్, వేముల శివకృష్ణ, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, తడికమల శ్రీనివాసరావు, కట్ట శేఖర్ బాబు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

