కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 4: సింగరేణి సంస్థ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన 2/2024 ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ కేటగిరి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్ – 42 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టం) ఈ2 గ్రేడ్ – 2 పోస్టులు, అన్ ఎగ్జిక్యూటివ్ కింద జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ -100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(మెకానికల్) 9,
అసిస్టెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరి 1- 47 పోస్టులు, ఎలక్ట్రికల్ ట్రైనీ కేటగిరి 1- 98 పోస్టులు కలిపి మొత్తం 34,900 మందికి హాల్టిక్కెట్లు జారీ చేసినట్లు జీఎం వెల్ఫేర్(ఆర్సీ) సామ్యూల్ సుధాకర్ తెలిపారు. మొత్తం ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 32కేంద్రాలను కేటాయించారు. కొత్తగూడెంలో 1, సత్తుపల్లిలో 1, ఖమ్మం 5, వరంగల్ 5, కరీంనగర్ 5, పెద్దపల్లి 1, సిద్ధిపేట 1, హైదరాబాద్ 13 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.