ఖమ్మం, నవంబర్ 22 : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గతంలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.
శుక్రవారం ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో వివిధశాఖల అధికారులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని అన్నారు. కార్యక్రమంలో సుడా పరిధిలోని మండలాకు చెందిన ఎంపీవోలు, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, డీటీసీపీవో ప్రసాద్, ఏపీవో ఖాదర్, జేపీవో భాస్కర్ పాల్గొన్నారు.