మామిళ్లగూడెం, మే 6: అటవీ హకుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు అనంత్‌నాయక్ సూచించారు. తద్వారా గిరిజనులు అడవికి హకుదారులనే అవగాహన కల్పించాలని అన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గిరిజనులకు అందుతున్న సంక్షేమ ఫలాలపై ఖమ్మం ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రుతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు, పథకాలు, పాలసీల ద్వారా చేకూరిన హకులు గిరిజనులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నా రు. గిరిజనుల సమస్యలను క్షేత్ర అధికారులు అర్థం చేసుకొని, వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకొని వారికి న్యాయం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో లోపాలను కమిషన్ సమీక్షిస్తుం దని అన్నారు. జిల్లాలో భూమిలేని ఎస్టీ వ్యవసాయ కూలీల వివరాలు సమర్పించాలని సూచించారు. జిల్లా లో ఎస్టీలకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల గురిం చి, ఎస్టీల ఆవాసాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల స్థితిగతులు మార్చి వారి సమస్యల పరిషారానికి చర్యలు తీసుకోవాలని, వారిని అభివృద్ధిపథంలోకి తేవాలని, వారి ఆవాసాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
జిల్లాలో ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, పాలసీలు, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత, కళాశాల స్థాయిల్లో 1,633 పాఠశాలలు ఉన్నాయని, వాటిల్లో 1,93,791 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 35,308 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 974 డబల్ బెడ్ రూం ఇళ్లను ఎస్టీలకు ఆందజేసినట్లు చెప్పారు. గిరిజన గురుకుల్లాల్లో చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మక జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారన్నారు. ఎస్టీలకు ప్రత్యేకంగా 2 క్రీడా పాఠశాలలు ఉన్నాయన్నారు. భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసి గిరిజన సంసృతిని, జీవనశైలిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధికా గుప్తా, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎన్సీఎస్టీ డీడీ ఆర్కే దూబే, ప్రసన్న, గోవర్ధన్ ముండే, డీఆర్వో శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.