‘ఇంటిగ్రేటెడ్’ పనులు వేగవంతం చేయండి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలోగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. స్కూల్ నిర్మాణ పనులతోపాటు వాటి నాణ్యతను తనిఖీ చేశారు.
- భద్రాద్రి కలెక్టర్ అంకిత్
అశ్వారావుపేట, మే 30 : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలోగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. స్కూల్ నిర్మాణ పనులతోపాటు వాటి నాణ్యతను తనిఖీ చేశారు. ఆవరణలో అంతర్గత రోడ్ల నిర్మాణంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. భూ భారతి, సాదా బైనామా, భూ సర్వేపై సమీక్షించారు.
వీటిపై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కార చర్యల గురించి తహసీల్దార్ కిశోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తర్వాత మున్సిపాలిటీలోని 15వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయిన ఇండ్ల గృహ ప్రవేశాలను జూన్ 2వ తేదీకి సిద్ధం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
ఇంకా పనులు ప్రారంభం కాని ఇండ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. ఆయా పనులను కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్‌రెడ్డి, తహసీల్దార్ డి.కిశోర్, ఎంపీడీవో రామకోటారెడ్డి, డిస్కం ఏడీఈ వెంకటరత్నం, ఏఈ వెంకట్, హౌసింగ్ ఏఈ మదన్, టీడీఈడబ్ల్యూ ఐడీసీ అధికారులు సాంబయ్య, బుగ్గయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

