కల్లూరు, మార్చి 15: గ్రామీణ క్రీడలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ క్రీడా మైదానాలను ఏర్పాటుచేసి యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తోందని అన్నారు. పట్టణంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో సీఎం కప్-2023 మండల స్థాయి క్రీడలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడల్లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని జిల్లాకు, రాష్ర్టానికి మంచిపేరు తెచ్చి పెట్టాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.3.50 కోట్లతో కల్లూరులో స్టేడియాన్ని నిర్మించి యువతకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మండల స్థాయిలో గెలుపొంది జిల్లా, రాష్ట్రస్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం పట్ల సర్పంచ్ నీరజ రఘును అభినందించారు.
ఈ పోటీల్లో 68 మంది పురుషులు, 38 మంది మహిళలు పాల్గొన్నారు. ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, నాయకులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, కాటంనేని వెంకటేశ్వరరావు, మేకల కృష్ణ, పెడకంటి రామకృష్ణ, ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఎస్సై రఘు, ఎంఈవో దామోదరప్రసాద్, హెచ్ఎం మాధవరావు, పీడీలు సత్యనారాయణరెడ్డి, పీఈటీలు విజయకుమారి, త్రివేణి, ఆంజనేయులు, సీనియర్ పీఈటీ పసుపులేటి వీరరాఘవయ్య, లక్ష్మినరసయ్య, కల్లూరు ఈవో కృష్ణారావు పాల్గొన్నారు.