బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఖమ్మం జడ్పీ చైర్మన్, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం/ సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన ప్రతినిధుల సమావేశానికి ఉమ్మడి జిల్లా నేతలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల గురించి సీఎం, పార్టీ అధినేత సమక్షంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సత్తుపల్లి, పాలేరు, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు హరిప్రియానాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కొత్తూరు ఉమా మహేశ్వరరావు, దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.