Central team visit on flood damage
ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదల కారణంగా భద్రాద్రి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృంద ప్రతినిధులు బుధవారం జిల్లాలో పర్యటించారు. బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలకు దెబ్బతిన్న పంటలను, ఇతర నష్టాలను స్వయంగా పరిశీలించారు.
- బూర్గంపహాడ్, అశ్వాపురం, భద్రాచలం మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
- నష్ట తీవ్రతను వివరించిన భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ బూర్గంపహాడ్, ఆగస్టు 3: ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదల కారణంగా భద్రాద్రి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృంద ప్రతినిధులు బుధవారం జిల్లాలో పర్యటించారు. బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలకు దెబ్బతిన్న పంటలను, ఇతర నష్టాలను స్వయంగా పరిశీలించారు. రైతులతోనూ మాట్లాడి నష్ట తీవ్రత గురించి తెలుసుకున్నారు. జాతీయ విపత్తులు, హోంమంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిప్యూటీ సెక్రటరీ అనీల్ గైరోల, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ రమేశ్‌కుమార్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ భయాపాండే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సీనియర్ సైంటిస్టు శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, ఐఈఎస్ రీజినల్ అధికారి ఎస్కే కుష్వాలతో కూడిన కేంద్ర బృందం అధికారులు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం రాత్రి ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.
ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర పదర్శనను గురువారం ఉదయం పరిశీలించారు. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, పంటలు, పశుసంపద, మిషన్ భగీరథ పథకాలు, ఇరిగేషన్ చెక్‌డ్యాముల గురించి భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక వివరించారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు బూర్గంపహాడ్ సమీపంలో కోతకు గురైన ప్రధాన రహదారిని పరిశీలించారు. ముంపు గ్రామాల్లో వరి 260 ఎకరాలు, పత్తి 633 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ మధుసూధన్‌రాజు, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్‌రెడ్డి, భీమ్లా, మంగ్యా, అభిమన్యుడు, మరియన్న, పురంధర్, తిరుమలేశ్, నళిని, శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- central team
- flood damage
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

