కారేపల్లి, ఆగస్టు 25: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ (Shaik Gousuddin) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆయన ఆర్ధిక సాయం చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సింగరేణి గ్రామపంచాయతీ మాజీ కార్మికుడు ఆదేర్ల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన షేక్ గౌసుద్దీన్ సోమవారం 50 కేజీల బియ్యంతో పాటు రూ.5,000 వేల నగదును అతడి కుమారుడు ఆదెర్ల శ్రీనివాసుకు అందజేశాడు.
ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ.. సింగరేణి గ్రామపంచాయతీలో వెంకటయ్య ఎన్నో సంవత్సరాలు స్వీపర్‌గా పనిచేశాడని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు గౌసుద్దీన్. ఈ కార్యక్రమంలోమాజీ జెడ్పీటీసీ వాంకులోత్ జగన్, మాజీ ఉపసర్పంచ్ మునుగొండ నాగేశ్వరావు, మాజీ వార్డు సభ్యుడు కలియుల్లా ఖాన్, బిక్షపతి, ఫిరోజ్, అబ్దుల్ వాహిద్, ముస్తాక్, సింగరేణి గ్రామపంచాయతీ పంపు డ్రైవర్ దిండి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.