కారేపల్లి, ఆగస్టు 15 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఖమ్మం పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా సింగరేణి (కారేపల్లి) మండల వైద్యాధికారి సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. దీంతో సురేశ్‌కు మండలంలోని వివిధ శాఖల అధికారులతో పాటు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.