KTR | కమల్ హాసన్‌ను కూడా మరిపించిన భట్టి విక్రమార్క.. నీ గ్యారంటీ కార్డులను బొంద పెట్టాల్నా..? : కేటీఆర్
ktr | అయ్యా భట్టిగారు నీ గ్యారంటీ కార్డులను బొంద పెట్టాల్నా.. సంవత్సరికం చేయాలా.. నీ గ్యారంటీ కార్డులకు, గ్యారంటీ గారడీకి ఏం సమాధానం చెప్తావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | మా భట్టి విక్రమార్క అయితే కమల్ హాసన్‌ను మించిన యాక్టింగ్ చేశారు. కమల్ హాసన్ గారిని మరిపించారు. కమల్ హాసన్ సరిపోరు.. ఇంకా పెద్ద యాక్టర్ ఎవరూ సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గుర్తుందా.. మల్లు భట్టి విక్రమార్క మధిరలో గ్యారంటీ కార్డులను పట్టుకొని ఈ కార్డులను భద్రంగా పెట్టుకోండి. నూరు రోజులు గట్టిగా గూట్లో దాచుకోండి. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. వచ్చి ఆ కార్డులు తీసుకొని మీ ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి రూ.2.50 లక్షలు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆయనను నమ్మమేమో అని తీసుకెళ్లి బాండ్ పేపర్‌పై రాసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టిన నాయకుడు భట్టి విక్రమార్క.
అయ్యా భట్టిగారు మీ ఖమ్మం జిల్లా వేదికగానే అడుగుతున్నా.. ఎక్కడ పెట్టుకోవాలే ఈ కార్డులు.. భద్రంగా పెట్టుకోమంటివి కదా.. ఎక్కడ పెట్టాలో చెప్పాలి.. ఏం చేయాలే నీ కార్డులను బొంద పెట్టాల్నా.. సంవత్సరికం చేయాలా.. నీ గ్యారంటీ కార్డులకు, గ్యారంటీ గారడీకి ఏం సమాధానం చెప్తావని అడుగుతున్నానన్నారు కేటీఆర్.
గ్యారంటీ కార్డులతో
కమల్ హాసన్ ను మైమరిపించిన భట్టి విక్రమార్క
ఇప్పుడు నీ గ్యారంటీ కార్డులను ఏం చేయాలి?– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఫైర్ 🔥 pic.twitter.com/D0wprjT3qN
— BRS Party (@BRSparty) June 24, 2026
Read Also :
Vitamin C | విటమిన్ సి అధికంగా ఉంటే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. అధ్యయనంలో వెల్లడి..
Jayam Ravi | జయం రవి ఇంట్లో కలకలం.. ఇద్దరు మహిళలు, బాలుడిని నిర్బంధించారనే ఆరోపణలు
MLC Dasoju Shravan kumar | డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసే మెకానిజం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

