మధిర : మధిర పట్టణ వాసి అయిన అమరా చంద్రకళకు భగవద్గీత కంఠస్థ పోటీల్లో బంగారు పథకం లభించింది. మైసూరులో దత్తపీఠం వారు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అమరా చంద్రకళ తన ప్రతిభను చాటుకొని బంగారు పథకం సాధించారు. ఈ సందర్భంగా బంగారు చంద్రకళ మాట్లాడుతూ.. కృష్ణపరమాత్మ ఆశీస్సులతో బంగారు పతకం సాధించానని చెప్పారు.
ఈ భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొనటంలో సహకరించిన పద్మ ఏలూరి, లక్ష్మీ సుమతి, గీతా మకరందం టీమ్ ఉపాధ్యాయులకు చంద్రకళ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రకళ భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించడం గర్వకారణమని ఆమె స్నేహితులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లగడపాటి రాధ, ఊట్ల సత్యవతి, కూరపాటి సీతామహాలక్ష్మి, మాధవరపు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.