భద్రాచలం, డిసెంబర్ 29 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు దేవస్థానం రూ.1.22 కోట్లను వెచ్చించగా.. రూ.67,31,342 ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెక్టార్ టికెట్ల ద్వారా రూ.32,79,750, రూ.2 వేల పరోక్ష సేవ టికెట్ల ద్వారా రూ.26 వేలు, రూ.వెయ్యి పరోక్ష టికెట్ల ద్వారా రూ.12 వేలు, స్పెషల్ దర్శనం టికెట్ల ద్వారా రూ.2,72,600, స్పెషల్ దర్శనంతోపాటు ఇతర సేవల ద్వారా రూ.4,10,534 ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే చిన్న లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.22,56,450, మహా లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.2.50 లక్షలు, కాటేజీల ద్వారా రూ.2,24,008 ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు.