కారేపల్లి, నవంబర్ 16: బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆ పార్టీ వైరా నియోజకవర్గ బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమంది అపరిచితులు వస్తుంటారని అన్నారు. ఈ క్రమంలో వారి మాయమాటలు వింటే మోసపోవడం ఖాయమని అన్నారు. అందుకని పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అదే సమయంలో మోసగాళ్లకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వచ్చిన తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. కారేపల్లి మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. నానూనగర్తండా, పాటిమీదగుంపు, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, రేలకాయలపల్లి, జైత్రాంతండా, గేట్ రేలకాయలపల్లి, బోటితండా, టేకులగూడెం, తొడిదలగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, మరికొన్ని సరికొత్త పథకాలు వస్తాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు శకుంతల, వాంకుడోత్ జగన్, రావూరి శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, తోటకూరి పిచ్చయ్య, ఉన్నం వీరేందర్, హన్మకొండ రమేశ్, అడ్డగోడ ఐలయ్య, ఎస్కే గౌసుద్దీన్, ధరావత్ మంగీలాల్, అడప పుల్లారావు, బత్తుల శ్రీనివాసరావు, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, భూక్యా రమణ, శంకర్, ఎండీ హనీఫ్, తాతా వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి, మణికొండ నాగేశ్వరరావు, బుడిగ ప్రభాకర్, సురేశ్, మురళి, రాము, కోటి, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.