‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ మహిళలకు..
– కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ
– సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ తరగతులు ప్రారంభం
రుద్రంపూర్, నవంబర్ 02 : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ మహిళలకు ఉచిత టైలరింగ్, రామవరం మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, గౌతంపూర్ మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను సోమవారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతారాణి వెంకటరమణ మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత, పరిసర ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే సేవా సమితి ప్రధాన లక్ష్యమన్నారు.
శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై, నైపుణ్యాలను శ్రద్ధగా నేర్చుకొని కోర్సులను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నేర్చుకున్న విద్యను స్వయం ఉపాధికి ఉపయోగించుకొని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా లబ్ధిదారులకు సేవా అధ్యక్షురాలి చేతుల మీదుగా శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అలాగే కొత్తగా శిక్షణ పొందుతున్న మహిళలకు పార్వతి మదన్మోహన్ ఒక మగ్గం స్టాండ్‌ను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎం జి. హరీష్, సీనియర్ పీఓ ఎం. మురళి, సేవా కోఆర్డినేటర్ సీహెచ్. సాగర్, సేవా కార్యదర్శి అనిత, శిక్షకులు, సేవా సభ్యులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

