ములకలపల్లి, సెప్టెంబర్ 23 : వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు అన్నారు. మంగళవారం ములకలపల్లిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, గోపాల్, కమల, లక్ష్మీనారాయణ, మిడియం శ్రీను పాల్గొన్నారు.