Tekulapalli | ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఫెన్సింగ్ వైర్?.. భద్రాద్రి జిల్లాలో విషాదం
ఫెన్సింగ్ వైర్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో చోటు చేసుకుంది.
టేకులపల్లి, జూన్ 25 : ఫెన్సింగ్ వైర్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో చోటు చేసుకుంది. విరాల్లోకి వెళ్తే..బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన మరుసటి రోజే అదే చేనులో…మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోదెం స్వరూప అత్త పోదెం చుక్కమ్మ (55) బుధవారం మొక్కంపాడు గ్రామ సమీపంలోని మాడె పాపయ్య పత్తి చేనులో కూలీ పనులకు వెళ్లారు.
ఈ క్రమంలో చేను వద్ద ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌తో చుక్కమ్మ మృతి చెందారు. ఈ ఘటనలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాపయ్య గురువారం ఉదయాన్నే చేనులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

