కొత్తగూడెం అర్బన్, మే 21 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని టీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కాగితపు వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 31న హైదరబాద్లోని జలవిహార్లో ”జర్నలిస్టు జాతర” రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ కు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి మహమ్మద్ షఫీ, టెoజు జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, జిల్లా సహాయ కార్యదర్శి అచ్చిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీజేఎఫ్ యూనియన్ సభ్యులు, వివిధ పత్రికల రిపోర్టర్లు పాల్గొన్నారు.