‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం టేకులపల్లిలో గుగులోతు రామచంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో...
– ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు డిమాండ్
టేకులపల్లి, అక్టోబర్ 29 : టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం టేకులపల్లిలో గుగులోతు రామచంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎట్టి నరసింహారావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న పంటలు ఆశించిన స్థాయిలో పండకపోగా, వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడులు కూడా తగ్గి రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రాల్లో నమోదైన వర్షపాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలుగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భూక్యా హర్జా, భూక్యా నర్సింగ్, కొడెం రవి, బానోతు వెంకట్రాం, అనంతోజు చంద్రాచారి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

