Yellandu : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు.
ఇల్లందు ఏప్రిల్ 25 : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్ మొత్తం తనిఖీ చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సూచనలు చేశారు. అలాగే ఇల్లెందు డివిజన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలను పరిశీలించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు సూర్యం, శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

