పాల్వంచ, మార్చి 26 : తెలంగాణ జెన్కోలో అలాగే కేటిపీఎస్ లోని కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌదాలో గురువారం టీజీ జెన్కో డైరెక్టర్ (హెచ్ ఆర్ అండ్ ఐఆర్) ఎస్ వి.కుమార్ రాజాని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జూనియర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన వారిలో క్వాలిఫై అయిన వారందరికీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా ఓ అండ్ ఎం స్టాఫ్ కు ప్రమోషన్స్ ఇచ్చే విధంగా ఆల్ చీఫ్ ఇంజనీర్స్ కి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం టీజీ జెన్కో డైరెక్టర్ (సివిల్) ఏ.అజయ్ ని కలిసి కేటీపీఎస్ 7వ దశలో క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసిన వారికి హెచ్ఆర్ఏ విడుదల చేయుటకు సీఈ కే టి పి ఎస్ 7వ దశకి తగు ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఆర్ వి కె ఎస్ విద్యుత్ సౌదా రీజినల్ కార్యదర్శి నవీన్ వర్మ, యాదాద్రి పవర్ ప్లాంట్ రీజనల్ కార్యదర్శి నాదెళ్ల రవికుమార్, బి టి పి ఎస్ నాయకుడు చెన్నారెడ్డి పాల్గొన్నారు.