Yellandu : పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి : డీఎస్పీ చంద్రభాను
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవారం
ఇల్లెందు, డిసెంబర్ 10 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవారం రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అంతా సహకరించాలని కోరారు. ఈ క్రింది సూచనలు తప్పక పాటించాలన్నారు.
– డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ నిషేధం
– ప్రతి ఓటర్ తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఓటు వేయాలి
– ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలు నేరాలు
– ప్రచారం నిర్ణయించిన సమయాల్లో మాత్రమే చేయాలి
– స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అనుమతి ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించాలి
– పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, ప్రచార సామగ్రి తీసుకెళ్లరాదు
– క్యూలో నిలబడి శాంతియుతంగా ఓటు వేయాలి
– రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లరాదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి గురించి, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే తెలపాలన్నారు. డయల్ 100 లేదా ఇల్లెందు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సంబురాలు, బాణాసంచా, ర్యాలీలు, భారీ సమావేశాలు పోలీస్ అనుమతి లేకుండా నిర్వహించరాదన్నారు. ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎస్హెచ్ఓ తాటిపాము సురేశ్, ఎస్ఐ హాసినా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

