నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
సింగరేణి సంస్థ వ్యాప్తంగా అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026లో భాగంగా సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ‘నిజాయితీతో సమృద్ధి’ (Probity for Prosperity) అనే నినాదంతో నిర్వహించిన...
రుద్రంపూర్, అక్టోబర్ 26 : సింగరేణి సంస్థ వ్యాప్తంగా అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026లో భాగంగా సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ‘నిజాయితీతో సమృద్ధి’ (Probity for Prosperity) అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వర్క్‌షాప్ హెచ్‌వోడీ జే.క్రిస్టోఫర్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా క్రిస్టోఫర్ మాట్లాడుతూ… సంస్థ అభివృద్ధి, ప్రగతిలో ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన పనితీరు కీలకమని పేర్కొన్నారు. విజిలెన్స్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్క్‌షాప్ ఇంజినీర్లు టి.అనిల్, ఉపేందర్ బాబు, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి ఎం.డి.సత్తార్ పాషా ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాప్ అధికారులు, యూనియన్ ప్రతినిధులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, డీఎల్ఆర్ కార్మికులు, ఆల్‌ట్రేడ్ అప్రెంటిస్‌లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

