పాల్వంచ, జూన్ 11 : విద్యాశాఖ అదేశాల మేరకు పట్టణ, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ మిత్ర (స్కావెంజర్స్) లకు బుధవారం పాల్వంచలోని బొల్లోరిగూడెం హైస్కూల్ లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఆయా పాఠశాలల్లో పనిచేసే స్వచ్ఛ మిత్ర సభ్యులు నిర్వహించాల్సిన పనులపై ఈ శిక్షణ కొనసాగింది.
ఈ సందర్భంగా ఎంఈఓ ఎ.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. మరుగుదోడ్లు, పరిశుభ్రత, కిచెన్, గార్డెన్ పెంపకం, జిల్లా కలెక్టర్ సూచించిన వివిధ ఔషద మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. పాఠశాల పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాధ్యతాయుతంగా భావించి పాఠశాలలో మంచి ఆహ్లాద వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగడంలో స్వచ్ఛ మిత్రల పాత్ర ఎక్కువ అన్నారు. ప్రధానోపాధ్యాయుల సూచనలు పాటిస్తూ పాఠశాలలను ఆదర్శవంతంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నోడల్ ఆఫీసర్ ప్రకాశ్‌రావు, రిసోర్స్ పర్సన్స్ శ్రీనివాస్, రమేశ్, రాంబాబు, మండల ఎంఐఎస్ కో ఆర్డినేటర్ శ్రావణి పాల్గొన్నారు.