చుంచుపల్లి, ఆగస్టు 26 : భారత రత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా 115వ జయంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మదర్ థెరిసా సేవా సంస్థ రుద్రంపూర్ ఆధ్వర్యంలో సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సేవారత్న అవార్డు గ్రహీత గూడెల్లి యాకయ్య అధ్యక్షత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్బీఐ మేనేజర్ బి.వెంకటరమణ, ఇన్చార్జి హెచ్ఎం లక్ష్మీ సేవా సంస్థ సభ్యులు మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కావునా మంచిగా ఎదగాలని, కలెక్టర్లుగా, ఇంజినీర్లుగా, టీచర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, మదర్ థెరిసాలాగా మంచి పేర్లు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్బీఐ నుండి ఊహించని బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధా, రజియా సుల్తానా, కె.వెంకటేశ్వర్లు, గణేశ్ చారి, ధీరజ్, సేవా సంస్థ సభ్యులు చిన్ని, విజయరాజ్, డి.శ్రీనివాస్, బొజ్జం సంపత్, కంచర్ల శ్రీను, రవి, లక్ష్మణ్, బి.కళ్యాణ్ పాల్గొన్నారు.